సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటో ప్లాట్‌ఫాంలో గాలిలోని తేమతో శుద్ధమైన తాగు నీరందించే మేఘదూత్ వాటర్ కియోస్క్ ప్లాంట్ ప్రారంభమైంది.
రైలు ప్రయాణికులకు మంచినీరు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు రైల్వే స్టేషన్ అభివృద్ధి సంస్థ ఎం.డి సంజీవ్ లోహియా తెలిపారు. ఈ నీరు మినరల్ వాటర్ కంటే కూడా శుద్ధిగా ఉంటుందన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యతను దక్షిణ మధ్య రైల్వే... మైత్రి ఆక్వాడేట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ సంస్థకు అప్పగించింది.
గాలిలోని తేమను ఒడిసిపట్టి, పలుమార్లు వడపోసి నీటిని శుద్ధి చేస్తారని మైత్రి ఆక్వాటెక్ సంస్థ ఎండీ రామకృష్ణ తెలిపారు. ఐఆర్టీసీటీ ప్రస్తుతం అందిస్తున్న ధరలకే ఈ నీటిని ప్రజలకు అందించనున్నట్లు వెల్లడించారు.
- ఇవీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల