బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని మెగాస్టార్ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని ఆయన ఆకాంక్షించారు. పాడిపంటలు వృద్ధి చెందాలని.. అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజలంతా కలిసి ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.
-
బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను pic.twitter.com/6VHLyoRw6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను pic.twitter.com/6VHLyoRw6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2021బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను pic.twitter.com/6VHLyoRw6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2021
బోనాల ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణలో బోనాల సంబురం షురూ అయింది. ప్రతిఏటా అంగరంగ వైభవంగా జరుపుకునే ఆషాఢమాస బోనాలు గోల్కొండ జగదాంబికా ఆలయం నుంచి మొదలయ్యాయి. జగదాంబికా ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల సందర్భంగా.. ఆలయాన్ని పూలు, విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నేటి నుంచి వచ్చే నెల 8 తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.