ETV Bharat / state

ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్ - తారకరత్న లేటెస్ట్​ హెల్త్​ అప్​డేట్స్​

Chiranjeevi Tweet on Taraka Ratna Health: తారకరత్నకు ఏ ప్రమాదం లేదనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని మెగాస్టార్​ చిరంజీవి అన్నారు. తారక్​.. త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. తారకరత్న ఆరోగ్యంపై ట్విటర్​ వేదికగా ఆయన స్పందించారు.

Chiru Tweet on Taraka Ratna Health
Chiru Tweet on Taraka Ratna Health
author img

By

Published : Jan 31, 2023, 11:13 AM IST

Chiranjeevi Tweet on Taraka Ratna Health: నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్​ చిరంజీవి స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారని ట్విటర్​ వేదికగా తెలిపారు. ఏ ప్రమాదం లేదనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చిందన్న చిరంజీవి.. త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. తారకరత్నను కాపాడిన వైద్యులు, దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

  • సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి
    ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.

    May you have a long and healthy life dear Tarakaratna!

    — Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విషమంగానే తారకరత్న ఆరోగ్యం: గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చేరిన సినీనటుడు నందమూరి తారకరత్నకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొననసాగిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన ఆరోగ్య నివేదికను విడుదల చేశారు. ‘తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పైనే ఆయనకు అత్యున్నత స్థాయి చికిత్స అందిస్తున్నాం. మాధ్యమాల్లో ప్రచారమవుతున్నట్లు ఆయనకు ఎక్మో వ్యవస్థ ఏర్పాటు చేయలేదు.

తారకరత్న కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిపై సమాచారాన్ని అందిస్తున్నాం’ అని తాజా నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిత్యం తారకరత్న కుటుంబసభ్యులతోనే ఉంటూ వైద్యులతో సంప్రదిస్తున్నారు. సోమవారం కర్ణాటక ఉద్యానశాఖ మంత్రి మునిరత్న ఆస్పత్రికి వచ్చి, తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించారు.

అసలేం జరిగింది: ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌, ఇతర స్పెషలిస్టుల వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.