మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఉదయం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చారు. అభిమానులు ఘన స్వాగతం పలికారు. మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఆచార్య సినిమా చిత్రీకరణ కోసం వచ్చారు.
చిరంజీవి విమానాశ్రయానికి చేరుకోగానే.. అభిమానులు పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. వారికి మెగాస్టార్ అభివాదం చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి బూరుగుపూడి చెక్ పోస్ట్ వరకు అభిమానులు ర్యాలీ నిర్వహించారు. గత నాలుగురోజులుగా సినీ నటుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మారేడుమిల్లిలోని షూటింగులో ఉన్నారు.
ఇదీ చదవండి: పల్లా రాజేశ్వర్‌రెడ్డి మళ్లీ ఓట్లడిగే హక్కు లేదు : ఉత్తమ్