RC15 Movie Shooting in Visakhapatnam: టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ 'ఆర్‌సీ 15'. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఏపీలోని విశాఖలో జరుగుతోంది. విశాఖలోని గీతం కళాశాలలో చుట్టూ డాన్సర్ల మధ్య హెలికాప్టర్ నుంచి రామ్‌చరణ్ దిగుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. షూటింగ్ విషయం తెలుసుకుని అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నటుడితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.
ఈ సినిమా చిత్రీకరణ కొద్దిరోజుల క్రితం కర్నూలులో జరిగింది. కర్నూల్లోని కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేశారు. ఆ సమయంలోనూ అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద షూటింగ్ చేసిన మూవీ టీమ్ ఇప్పుడు విశాఖలో తదుపరి చిత్రీకరణను మొదలుపెట్టింది.
ఇక సినిమా విషయానికి వస్తే.. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది 'ఆర్‌సీ 15'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్. జె. సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి: