Meeting of Leaders Various States With KCR: బీఆర్ఎస్లో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌కు చెందిన పలువురు నేతలు హైదరాబాద్ ప్రగతిభవన్‌లో కలిశారు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్,.. మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్‌గడ్ మాజీ మంత్రి చబ్బీలాల్ రాత్రే,.. గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్.. సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు,.. ఆసరా పింఛన్లు తదితర పథకాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి ఇతర కార్యక్రమాల వివరాలను.. ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని నాయకులు ఆహ్వానించారు. దేశంలో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం ప్రస్తుతం అవసరం ఉందన్నారు. పార్టీ విధివిధానాలపై వివిధ రాష్ట్రాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు బీఆర్ఎస్లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
మరోవైపు రేపు మహారాష్ట్రలోని గురుద్వార్‌లో సభనిర్వహణ ఏర్పాట్లను బీఆర్ఎస్ పూర్తి చేసింది. ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రేపు మధ్యాహ్నం గురుద్వార్‌లో దర్శనం అనంతరం కేసీఆర్.. నాందేడ్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారని బీఆర్ఎస్ నాయకులు వివరించారు. మహారాష్ట్రకు చెందిన ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. సభ పూరైన తర్వాత సాయంత్రం మీడియా సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఆనంతరం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారని పార్టీ నేతలు వెల్లడించారు.
ఇవీ చదవండి: 6న రాష్ట్ర బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన కేసీఆర్