ETV Bharat / state

సమగ్ర నీటిపారుదల విధాన రూపకల్పనపై కార్యశాల - రాష్ట్రానికి సమగ్ర నీటిపారుదల నిర్వహణ విధాన రూపకల్పనపై కార్యశాల

రాష్ట్రానికి సమగ్ర నీటిపారుదల నిర్వహణ విధాన రూపకల్పన, శాఖ పునర్​వ్యవస్థీకరణపై విశ్వేశ్వరయ్య భవన్​లో సాగునీటి శాఖ కార్యశాల నిర్వహించింది. సాగునీటి శాఖ ఆస్తులు, ఇతర సాంకేతికాంశాలు, సహాయక సేవలు, చట్టాలు తదితర అంశాలను చర్చించారు.

సమగ్ర నీటిపారుదల విధాన రూపకల్పనపై కార్యశాల
సమగ్ర నీటిపారుదల విధాన రూపకల్పనపై కార్యశాల
author img

By

Published : Dec 21, 2019, 10:51 PM IST


రాష్ట్రానికి సమగ్ర నీటిపారుదల నిర్వహణ విధాన రూపకల్పనతో పాటు శాఖ పునర్​వ్యవస్థీకరణపై సాగునీటి శాఖ కార్యశాల నిర్వహించింది. హైదరాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో జరిగిన సదస్సులో ఈఈ నుంచి ఈఎన్సీల వరకు మొత్తం 250 మంది ఇంజినీర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సమగ్ర విధాన రూపకల్పన, శాఖ పునర్​వ్యవస్థీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీర్ల అభిప్రాయాలు సేకరించారు.

ఇంజినీర్ల పాత్ర క్రియాశీలకంగా ఉండాలి..

సమగ్ర విధానాన్ని రూపొందించడంతో పాటు సాగునీటి శాఖ ఆస్తులు, ఇతర సాంకేతికాంశాలు, సహాయక సేవలు, చట్టాలు, ఇతర శాఖలతో సమన్వయం తదితర అంశాలపై కార్యశాలలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలైన కోటి పాతిక లక్షల ఎకరాల మాగాణిలో ఈఈల పాత్ర క్రియాశీలకంగా ఉందని.. విధాన రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఈఎన్సీ మురళీధర్ అన్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో 80కి పైగా పంప్ హౌజ్ లు పని చేయనున్నందున ఎత్తిపోతల పథకాలను సమర్థంగా నిర్వహించేందుకు సమగ్ర విధానం కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తెలిపారు.

మరోమారు కార్యశాల

ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. పంప్ హౌజ్​లు, విద్యుత్ వ్యవస్థ నిర్వహణ, ఇంజినీర్ల బాధ్యతలు, సిబ్బంది అవసరాలు తదితర అంశాలను వివరించారు. పంప్ హౌజుల్లో ఎదురవుతున్న సమస్యలను పలువురు ఇంజినీర్లు ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసేలా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇంజినీర్లు.. న్యాయపరమైన చిక్కుల కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు కల్పించాలని కోరారు. జనవరిలో మరోమారు కార్యశాల నిర్వహించాలని, అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలో విస్తృత సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.

సమగ్ర నీటిపారుదల విధాన రూపకల్పనపై కార్యశాల

ఇవీ చూడండి: మేడారంలో పనులు మందగమనం

File : TG_Hyd_93_21_Irrigation_Workshop_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Whatsapp ( ) రాష్ట్రానికి సమగ్ర నీటిపారుదల నిర్వహణా విధాన రూపకల్పనతో పాటు శాఖ పునర్వ్యవస్థీకరణపై సాగునీటి శాఖ కార్యశాల నిర్వహించింది. హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన సదస్సులో ఈఈ మొదలు ఈఎన్సీల వరకు 250 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సమగ్ర విధాన రూపకల్పన, శాఖ పునర్వ్యవస్థీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీర్ల అభిప్రాయాలు సేకరించారు. సమగ్ర విధానాన్ని రూపొందించడంతో పాటు సాగునీటి శాఖ ఆస్తులు, ఇతర సాంకేతికాంశాలు, సహాయక సేవలు, చట్టాలు, ఇతర శాఖలతో సమన్వయం తదితర అంశాలపై కార్యశాలలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలైన కోటీ పాతిక లక్షల ఎకరాల మాగాణిలో ఈఈల పాత్ర క్రియాశీలకంగా ఉందని... విధాన రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఈఎన్సీ మురళీధర్ అన్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో 80 కి పైగా పంప్ హౌజ్ లు పని చేయనున్నందున ఎత్తిపోతల పథకాలకు సమర్థంగా నిర్వహించేందుకు సమగ్ర విధానం కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తెలిపారు. ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి సమావేసంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. పంప్ హౌజ్ లు, విద్యుత్ వ్యవస్థ నిర్వహణ, ఇంజనీర్ల బాధ్యతలు, సిబ్బంది అవసరాలు తదితరాలను వివరించారు. పంప్ హౌజుల్లో ఎదురవుతున్న సమస్యలను పలువురు ఇంజనీర్లు ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసేలా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇంజనీర్లు... న్యాయపరమైన చిక్కుల కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు కల్పించాలని కోరారు. జనవరిలో మరోమారు కార్యశాల నిర్వహించాలని, అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలో విస్తృత సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.