ETV Bharat / state

Meerpet Minor Girl Gang Rape Case : బాలికపై సామూహిక అత్యాచారం.. మెడపై కత్తి పెట్టి మరీ ఘాతుకం - Minor Girl Gang Raped In Hyderabad

Meerpet Minor Girl Gang Rape Case : గంజాయి మత్తులో ముగ్గురు యువకులు హైదరాబాద్​లోని మీర్​పేట్​లో​ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి బాధితురాలి తమ్ముడిని బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Minor Girl Case Update
Hyderabad Meerpet Minor Girl Case Update
author img

By

Published : Aug 22, 2023, 10:10 AM IST

Meerpet Minor Girl Gang Rape Case : సమాజంలో రోజురోజుకూ బాలికలు, మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. (Minor Girl Rape In Meerpet)చిన్నాపెద్దా అన్న తేడా లేదు ఆడపిల్ల అయితే చాలనుకుని మీద పడిపోతున్నారు కొందరు కామాంధులు. వావి వరసలు మరచి, కాపాడాల్సిన వారే ఈ ఘటనలకు పాల్పడుతున్నారు. తమ కామ వాంఛతో క్షణికావేశంలో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు అర్ధరాత్రే కాదు.. పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా బయపడే పరిస్థితి నగరంలో నెలకొంది. ప్రభుత్వం మహిళల సంరక్షణకై ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా వారిని శిక్షించినా.. కీచకుల అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాలికపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా ఏ దిక్కు లేని కుటుంబాలనే వీరు టార్గెట్​గా చేసుకుంటున్నారు​. తాజాగా హైదరాబాద్‌లోని మీర్​పేట​లో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Hyderabad Meerpet Minor Girl Gang Rape Case Update : 16 ఏళ్ల బాలికపై గంజాయి మత్తులో ముగ్గురు సాముహిత అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​ లాల్​బజార్​కు చెందిన బాలిక (16) తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. 15 రోజుల క్రితం తన సోదరుడి (14)తో కలిసి మీర్​పేట(Meerpet)లోని కాలనీలో ఉంటున్నారు. దగ్గరి బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్​సుఖ్​నగర్​లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. బాలిక తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తుంటాడు.

Man Blackmailed Girl at jawaharnagar : 'ఇన్​స్టాగ్రామ్​లో ఫాలో అవ్వకపోతే.. ఫొటోలు మార్ఫింగ్​ చేస్తా'

Minor Girl Was Raped In Hyderabad : సోమవారం ఉదయం 9 గంటల సమయంలో బాలిక తన సోదరుడితో సహా ముగ్గురు చిన్నారులతో ఇంట్లో కలిసి ఉన్నప్పుడు ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. ఎనిమిది మందిలో నలుగురు అప్పటికే గంజాయి మత్తులో ఉన్నారు.​ బాలికపై కత్తిపెట్టారు. వారు ఉంటున్న భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలిన వారు బాధితురాలి తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారులను బెదిరించి బంధించారు.

Attempted Murder of Boy in Jagadgirigutta : బ్లేడుతో బాలుడి గొంతు కోసి హత్యాయత్నం.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

Minor Girl Gang Raped By Three Youngsters : పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాధితురాలిని కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారానికి(Meerpet Minor Girl Gang Rape Case Update) పాల్పడ్డారు. మైనర్​ గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి మీర్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యారప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షలు తర్వాత బాధితురాలిని సఖి కేంద్రానికి తరలించారు.

బాధితురాలు ఉంటున్న భవనంలోనే నిందితులు : బాలిక ఉంటున్న భవనంలో కింది అంతస్తులో ఉండే టైసన్​, మంగళ్​హాట్​కు చెందిన రౌడిషీటర్​ అబేద్​ లాలా నిందితుల్లో ఉన్నట్లు బాధితురాలి తమ్ముడు తెలిపాడు. మరో ఇద్దరు నిందితులూ తమ ఇంటికి దగ్గర్లోనే ఉంటారని పోలీసులకు వివరించాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం రాచకొండ పోలీస్ కమిషనర్​ డీఎస్​ చౌహాన్ ఏడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగిన పోలీసులు మాత్రం నిర్ధారించడం లేదు. సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.

Hyderabad Man Kills Daughter : భవిష్యత్​లో కష్టాలొస్తాయని.. కూతుర్ని చంపేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.