ETV Bharat / state

దళారీ దౌర్జన్యం... మార్కెట్​లో అన్నదాతపై దాడి - అన్నం పెట్టే అన్నదాతపై దళారుల దాడి

దేశానికి అన్నం పెట్టే రైతన్నపైనే దాడికి తిగారు దళారులు. పండించిన పండ్లను అమ్ముకోవడానికి వచ్చిన అన్నదాతపై చేయి చేసుకున్నారు. కల్వకుర్తి నుంచి బొప్పాయిని విక్రయించేందుకు వచ్చిన ఓ రైతు ఇదేంటని ప్రశ్నించినందుకు హైదరాబాద్​ కొత్తపేట పండ్ల మార్కెట్​లో​ కమీషన్​ ఏజెంట్ల తరఫు దళారులు కొట్టారు. అడ్డువచ్చిన అన్నదాత సోదరుడిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై మార్కెటింగ్​ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి ఘాటుగా స్పందించారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ మార్కెటింగ్​ మార్కెటింగ్ శాఖ సంచాలకులకు ఆదేశాలు జారీ చేశారు.

దళారుల దాడి
author img

By

Published : Sep 24, 2019, 8:31 PM IST

అన్నం పెట్టే అన్నదాతపై దళారుల దాడి

నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన రైతు చంద్రయ్య... బొప్పాయి పంట అమ్ముకోవడానికి హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్​కు వచ్చారు. మార్కెట్‌లో వేలం పాట పూర్తైన తర్వాత... ఒక దళారీ వచ్చి అనుమతి లేకుండా మూడు బొప్పాయి పండ్లు తీసుకుని వెళ్తుండగా... చంద్రయ్య అడ్డు చెప్పారు. తమకే అడ్డు చెబుతావా మీ బతుకెంత అంటూ దళారులు రైతుపై దాడి చేశారు. అడ్డుకోబోయిన సోదరుడు వెంకట్‌పై కూడా చేయి చేసుకున్నారు.

స్టేషన్​లో ఫిర్యాదు..

ఈ ఘటనపై చంద్రయ్య.. చైతన్యపురి పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. రైతే రాజు అంటున్న ప్రభుత్వం... వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో దళారులు, కమీషన్ ఏజెంట్ల దాడులు బాధాకరమని చంద్రయ్య వాపోయారు.

ధరల మయాజాలం..

బహిరంగ విపణిలో మంచి ధరలు పలుకుతున్న సమయంలో కూడా... మామిడి, బత్తాయి, దానిమ్మ, ఆపిల్‌, ద్రాక్ష... ఇలా ఏ పంట తీసుకెళ్లినా సిండికేటైన వర్తకులు, కమీషన్ ఏజెంట్లు కృత్రిమంగా ధరలు తగ్గించేసి రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడికి దిగుతున్నారు. మార్కెట్‌లో కిలో బొప్పాయి రూ.40 నుంచి రూ.55 ధర పలుకుతుండగా బయట కిలో 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు.

మంత్రి ఆగ్రహం...

ఈ ఘటనపై మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రైతులపై దాడిని తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయితో ఫోన్‌లో మాట్లాడారు. దళారులు రైతుల్ని పీడించడం తగదని, తక్షణమే బాధ్యుల లైసెన్స్ రద్దు చేసి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఇక నుంచి దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

Tg_hyd_49_24_RJNR Batukamma chiralu_ab_ts10020. 8008840002. Middela.Bhujangareddy.( Rajendranagar) కులాలకు అతితంగా మహిళలకు బతుకమ్మ చీరలు పంచడం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మున్సిపల్, మండలంలోని ప్రాంతాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలలో ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు... ఆయనతో పాటు.. జడ్పీటీసీ నిరటి తన్విరాజ్, ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్ మరియు అధికారులు పాల్గొన్నారు...ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పండపర్చన వాటితో పాటు.. మేనిపేస్టులో లేనివాటిని కూడా అమల్లోకి తీసుకోచడాని ప్రకాష్ గౌడ్ తెలిపారు... ప్రతి పండుగలకు బట్టలు పంచుతున్నామని... కేసీఆర్ ను గ్రామగ్రామలలో పెద్ద కొడుకుగా మరికొన్ని గ్రామాలలో దేవునిగా కొలుస్తున్నారని ఆయన కొనియాడారు...తన నియోజకవర్గలో ఇప్పటికే 70 వేల బతుకమ్మ చీరలు పంపిని చేశామని ఎమ్యెల్యే వివరించారు... అనంతరం... శంషాబాద్ మండలంలోన జుకల్ గ్రామంలో ఓ వృదుడు వ్యవసాయ బావిలో పడ్డ వ్యక్తిని సురక్షితంగ కాపాడిన కెన్స్టల్ కృష్ణమాచారికి సన్మానించిన ఎమ్యెల్యే ప్రకాష్ గౌడ్. బైట.. ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ ఎమ్యెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.