వైద్యారోగ్య శాఖలో ఉన్న సమస్యలపై మెడికల్ జేఏసీ గళమెత్తింది. కోఠిలోని డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో మెడికల్ జేఏసీ సభ్యులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా పోస్టింగ్‌ల విషయంలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నవారికి హెచ్‌ఓడీ పదవికి అవకాశం రావడం లేదని పేర్కొన్న జేఏసీ సభ్యులు... అనేక ఆస్పత్రుల్లో ఇంఛార్జీ సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న వారు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఒక్కొక్కరికి రెండు, మూడు పదవులు కట్టబెట్టడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఏళ్లుగా ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: కరోనా బాధితులకు మోనోక్లోనల్ యాంటీబాడీల భరోసా