ETV Bharat / state

లోపమా?.. నిర్లక్ష్యమా? - NILOFER

కడుపులో కత్తెర ఘటన మరచిపోకముందే... ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ సారి ఏకంగా వారి అజాగ్రత్తను 92 మంది పసికందులపై చూపించారు. నాంపల్లి ప్రాంతీయ ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్వాకం ఓ చిన్నారి ప్రాణాలు తీయగా... మరో ముగ్గురి పరిస్థితిని విషమంగా మార్చింది.

పసికందులపై నిర్లక్ష్యమా?
author img

By

Published : Mar 7, 2019, 7:09 PM IST

Updated : Mar 7, 2019, 7:32 PM IST

పసికందులపై నిర్లక్ష్యమా?
హైదరాబాద్‌ నాంపల్లి ప్రాంతీయ ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్లక్ష్యం 22 మంది పసికందుల ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రతీ బుధవారం లాగే నిన్న కూడా 92 మంది చిన్నారులకు టీకాలు వేశారు. పిల్లలకు జ్వరం రాకుండా తక్కువ డోస్​ ఉన్న పారాసెటమాల్ మాత్రను పాలల్లో కలిపి తాగిస్తారు. దాని​కి బదులు పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోస్​ ఉన్న ట్రెమడాల్​ ఇచ్చారు. చిన్నారులకు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో పాటు ఫిట్స్ లక్షణాలు కన్పించగా తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటినా నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు.

వెంటిలేటర్​పై ముగ్గురు చిన్నారులు..
నిన్న రాత్రి 15 మందిచిన్నారులను చేర్చగా... ఈ రోజు ఉదయం మరో ఏడుగురిని తీసుకొచ్చారు. పొద్దున యాసిన్​ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోగా... పరిస్థితి విషమించిన మరో ముగ్గురికి వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

బాధ్యులను కఠినంగా శిక్షించాలి...
చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన అనంతరం ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా, ఎంఐఎం
నేతలు పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్​ చేశారు.

ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొనేసరికి భారీగా పోలీసులు మోహరించారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది.

ఇవీ చూడండి:పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

Intro:filename:

tg_adb_01_07_sai_baba_alaya_varshikotsavam_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం బట్టుపల్లి చౌరస్తాలో శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయం 30వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయం స్థాపించి 30 సంవత్సరాలు అయిన సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం కాల్చారు. ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
Last Updated : Mar 7, 2019, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.