ETV Bharat / state

మెకానిక్ ఆవిష్కరణలతో పేదోళ్ల మోము విరబూసింది!

అతనికి ఆటోమొబైల్​ రంగమంటే ఆసక్తి. ఇంజినీర్​​ అవుదాం అనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్​తోనే చదువు ఆపి వేయాల్సి వచ్చింది. ఇంజినీర్​ పట్టా లేకుంటేనేం.. తనకున్న ప్రతిభతో అద్భుతాలను సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. కొత్త ప్రయోగాలతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నాడు. అతనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన స్టాలిన్​. అతను చేసిన అద్భుతాలు ఎంటో చదివేద్దామా...

mechanic stalin
స్టాలన్​
author img

By

Published : Feb 27, 2020, 7:32 PM IST

స్టాలన్​ ఆవిష్కరణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నెహ్రూనగర్​కు చెందిన జిల్లేపల్లి స్టాలిన్​కు ఆవిష్కరణలు అంటే ఇష్టం. పరిస్థితుల ప్రభావంతో ఆటోమొబైల్ రంగాన్ని జీవనోపాధిగా ఎంచుకున్నాడు. 1996లో పాల్వంచలో సొంతంగా ఓ గ్యారేజీ ఏర్పాటు చేసుకున్నాడు. మెకానిక్​గా మారినప్పటికీ ఏదో చేయాలన్న తపన స్టాలిన్​ను వెంటాడుతూనే ఉంది.

రిక్షాలకు విద్యుత్ మోటార్లు

డీజిల్ మెకానిక్​గా ఆయనకున్న మంచి పేరును మరింత ఇనుమడింప చేసుకోవాలని యోచించి తొలితరంలో వచ్చిన ఆటో ట్రాలీలకు ప్రత్యేకంగా సెల్ఫ్ డైనమోలు బిగించి అందరి మన్ననలు పొందాడు. దివ్యాంగుల సౌకర్యార్థం ద్విచక్ర వాహనాన్ని త్రిచక్ర వాహనంగా మార్చాడు. రిక్షాలనే నమ్ముకుని వాటిని తొక్కలేక జీవితాలను భారంగా వెళ్లదీస్తున్న వారి జీవన విధానం స్టాలిన్​ను కలిచివేసింది. రిక్షాను తొక్కే భారం లేకుండా రిక్షాలకు విద్యుత్ మోటార్లను అమర్చడం మొదలు పెట్టాడు.

గాలి పీడనంతో నడిచే వాహనం

మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేయాలనే తాపత్రయాన్ని స్టాలిన్ వీడలేదు. ఎప్పటికైనా గాలి పీడనంతో నడిచే వాహనాన్ని కనిపెడతానని, అదే తన చిరకాల వాంఛని స్టాలిన్ చెబుతున్నాడు. ప్రభుత్వం చేయూతనిస్తే తన కల సాకారం అవుతుందని, భవిష్యత్తు తరాలకు ఉపయోగం ఉంటుందని అంటున్నాడు.

ఇదీ చదవండి: ఆ వాట్సాప్​ గ్రూపుల్లోనే దిల్లీ అల్లర్లకు స్కెచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.