ETV Bharat / state

ఈ ఏడాది ఆర్టీసీపై కాసుల వర్షం.. రూ.5879కోట్లకు చేరిన ఆదాయం

Sajjanar on RTC Annual Report: ఈ ఏడాది టీఎస్​ఆర్టీసీకీ కాసుల వర్షమే కురిసింది. టీఎస్​ఆర్టీసీ 2022 సంవత్సరం రిపోర్టును ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ప్రకటించారు. ఈ ఏడాది ఆదాయం రూ.5879 కోట్లకు చేరిందని​ ప్రకటించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో ఆర్టీసీ వార్షిక నివేదిక వివరాలను టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌తో కలిసి ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు.

TSRTC
టీఎస్​ఆర్టీసీ
author img

By

Published : Dec 27, 2022, 5:32 PM IST

Updated : Dec 27, 2022, 7:56 PM IST

Sajjanar on RTC Annual Report: టీఎస్​ఆర్టీసీకి ఈ ఏడాదిలో రూ.5879 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో ఆర్టీసీ వార్షిక నివేదిక వివరాలను టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌తో కలిసి ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. ఈ 2022సంవత్సరంలో ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా అభివృద్ది సాధించినట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో నష్టాన్ని మరింత తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు.

ఒక్కరోజే రూ.20కోట్ల ఆదాయం: రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో రూ.20కోట్ల రెవెన్యూ వచ్చిందని.. 12డిపోల్లో వందకు వందశాతం ఓఆర్ వచ్చిందని ఎండీ హర్షం వ్యక్తం చేశారు. సిటీలో బస్‌లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గమనించి మెట్రో కాంబినేషన్ టికెట్‌ను రూ.20నుంచి 10రూపాయలకు తగ్గించడంతో చాలా మార్పు వచ్చిందని సజ్జనార్​ వివరించారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే కార్మికుల మీద అధికారుల వేధింపులు లేవని.. వేధింపులు అనేవి ఉంటే రెవెన్యూ వచ్చేదేకాదని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ పేర్కొన్నారు.

"టీఎస్​ఆర్టీసీ ప్రధాన ఆదాయం ప్రయాణికులు.. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వస్తేనే సంస్థ ఆదాయం పెరుగుతుంది. దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. 2020లో కొవిడ్​ కారణంగా సంస్థ భారీ నష్టాలను చవిచూసింది. 2020లో సంస్థ ఆదాయం రూ.2478 కోట్లు టర్నోవర్​ అయితే, 2021లో రూ.3311కోట్లుగా ఉంది. అదే ఇప్పుడు 2022లో చూసుకుంటే రూ.5879 కోట్లు ఆదాయం వచ్చింది." - సజ్జనార్​, ఆర్టీసీ ఎండీ

2022వ సంవత్సర ఆర్టీసీ వార్షిక ఆదాయాన్ని ప్రకటిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.