ETV Bharat / state

రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని పరిశీలించిన మేయర్ - పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ శివారు రాంపల్లిలో 6 వేల 240 డబుల్ బెడ్‌రూంలను ప్రభుత్వం నిర్మించిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇందుకోసం 541 కోట్ల 83 లక్షల రూపాయల వ్యయంతో నివాస సముదాయాలు నిర్మించినట్లు స్పష్టం చేశారు.

రెండు పడక గదుల ఇళ్ల సమాదాయాన్ని పరిశీలించిన మేయర్ రామ్మోహన్

author img

By

Published : Aug 23, 2020, 8:11 PM IST

పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాంపల్లిలో 6 వేల 240 డబుల్ బెడ్‌రూంలను ప్రభుత్వం నిర్మించిందని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఇందుకు రూ. 541 కోట్ల 83 లక్షల వ్యయంతో నివాస సముదాయాలు పూర్తయ్యాయని తెలిపారు.

గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా...

ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా రాంపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల గృహ సముదాయంలో ఇండోర్ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, బస్ టెర్మినల్ వాకింగ్ ట్రాక్, లాంగ్ స్పేస్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ స్పష్టం చేశారు.

సమాంతరంగా 100 ఫీట్ల రోడ్డు...

రెండు పడక గదులను అధికారులతో కలిసి మేయర్ పరిశీలించారు. పక్కనే రైల్వే ట్రాక్‌కు సమాంతరంగా 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, పర్యావరణం, నీటి సరఫరా, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను నెలలో పూర్తి చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌ రూంలు నిర్మించిన స్థలాల్లో మేయర్ రామ్మోహన్ మొక్కలు నాటారు.

రెండు పడక గదుల ఇళ్ల సమాదాయాన్ని పరిశీలించిన మేయర్ రామ్మోహన్

ఇవీ చూడండి : 'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.