కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. వైద్యుల సలహాలు పాటించి ఇప్పటికి ఎంతో మంది వైరస్ను జయించారని తెలిపారు.
తనకు పాజిటివ్ వచ్చినా హోం ఐసోలేషన్లో ఎంతో ధైర్యంగా ఉన్నట్లు మేయర్ వెల్లడించారు. ఇంట్లోనే వ్యాయామం చేస్తూ, ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానని పేర్కొన్నారు. విటమిన్స్ కలిగిన ఆహారం తింటూ... వైద్యుల సూచనలు పాటిస్తే మహమ్మారి నుంచి బయటపడొచ్చని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు