హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో.. పాదచారులకు వంతెనలు నిర్మిస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మెహన్ తెలిపారు. ప్రశాంతంగా రోడ్డును దాటేలా... ఆధునిక పద్దతిలో ప్రధాన కూడళ్లు, వాణిజ్య సముదాయాల్లో వంతెనలు నిర్మిస్తున్నట్లు వివరించారు. రోడ్డు దాటుతున్న సమయంలో జరుగుతున్న ప్రమాదాలతో కుటుంబాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు.
మల్కాజిగిరి సర్కిల్ నేరేడుమెట్ క్రాస్ రోడ్డులో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను మేయర్ పరిశీలించారు. ఎఫ్ఓబీపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. వారికి ఇబ్బంది కలుగకుండా నిర్మాణం చేపడతామని నచ్చజెప్పారు. వారు అంగీకరించడంతో... ఆమోదయోగ్యoగా అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి : తెల్లవారితే పెళ్లి.. ఇంతలోనే ఏం జరిగిందంటే..?