లాక్డౌన్ సమయంలో రోడ్ల విస్తరణ, స్లిప్,లింక్ రోడ్లు, ఫ్లైఓవర్స్, అండర్ పాస్ పనులను ముమ్మరం చేసినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇవాళ ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులతో కలసి కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే రోడ్ల అనుసంధానం కోసం నిర్మిస్తున్న స్లిప్, లింక్ రోడ్ల పనులను పరిశీలించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్బంగా ఆయా లింక్, స్లిప్ రోడ్ల పనులకు అవసరమైన స్థల సేకరణకు సహకరించాలని సంబంధిత ఆస్తుల యజమానులకు మేయర్ విజ్ఞప్తి చేశారు.
నగర వ్యాప్తంగా స్లిప్, లింక్ రోడ్ల నిర్మాణం: మేయర్
ప్రధాన రోడ్లపై వత్తిడిని తగ్గించి, వాహనాలు రాకపోకలను సులభతరం చేసేందుకు నగర వ్యాప్తంగా స్లిప్, లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.