భారీ వర్షాలు, వరదలు తగ్గాలని హైదరాబాద్ పురానాపూల్ కమాన్ వద్ద మూసీ నదికి ప్రజాప్రతినిధులు శాంతిపూజ చేశారు. గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొని పూజలు నిర్వహించారు.
1908లోనూ మూసీకి భారీ వరదలు వచ్చినప్పుడు నాటి పాలకులు ఈ విధంగా పూజలు చేశారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ... ప్రస్తుతం అమ్మవారికి పూజలు చేసినట్లు మంత్రి తలసాని వెల్లడించారు.
ఇదీ చూడండి: మూసీ ఉగ్రరూపం.. ముసారాంబాగ్ వంతెనపై వరద ప్రవాహం