హైదరాబాద్ శివారు అత్తాపూర్‌లోని మంజు వైన్స్, శివరామ్‌పల్లిలోని ఫ్రెండ్స్ వైన్స్ దుకాణాల్లో భారీ దొంగతనం జరిగింది. శివరామ్ పల్లిలో అర్థరాత్రి రెండున్నర గంటలకు చోరీకి పాల్పడగా.. అదే వ్యక్తి అత్తాపూర్‌లో 3.45 గంటలకు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
అత్తాపూర్ మద్యం షాపులో భారీగా విదేశీ మద్యం, నగదును అపహరించారని యాజమాని కుమార్ గౌడ్ తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఆ గ్రామంలో మద్యం అంటే ఛీ... ఛీ...