నాగార్జునసాగర్‌లో ఇతర పార్టీల అభ్యర్థులందరి కంటే భాజపా అభ్యర్థి ఉన్నతమైన వ్యక్తి అని మాజీమంత్రి, భాజపా నేత ఏ.చంద్రశేఖర్ అన్నారు. జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టడం బలహీనవర్గాలకు గర్వకారణమని తెలిపారు. ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాజీమంత్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాకు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు.
అనంతరం మాజీమంత్రి రవీంద్రా నాయక్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్న చంద్రశేఖర్... నిరుద్యోగి సునీల్ నాయక్‌ను సీఎం కేసీఆరే హత్య చేశారని ఆరోపించారు. ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గిరిజన యువత ఏకమవుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను భాజపా మాత్రమే నెరవేర్చగలదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హయాంలో తెదేపాలో ఎంత క్రమశిక్షణ ఉండేదో.. మళ్లీ భాజపాలో మాత్రమే ఉందన్నారు.
ఇదీ చదవండి: కులాలను బట్టి గౌరవిస్తున్నారు: ఈటల రాజేందర్