ETV Bharat / state

Massage Centers Seized in Banjarahills : మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్ట్ - Prostitution in massage centers in Banjara Hills

Massage Centers Seized in Banjarahills : మసాజ్ థెరపిస్టులు, బ్యుటీషియన్ల పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి.. బంజారాహిల్స్​లోని మసాజ్ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Police Raids on masage centers in hyderabad
Masage Centers Seized in Banjarahills
author img

By

Published : Aug 11, 2023, 5:38 PM IST

Massage Centers Seized in Banjarahills : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు. డబ్బు ఎర చూపి వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి.. క్రాస్‌ మసాజ్‌ చేయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. పలువురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

పార్లర్​ ముసుగులో 'సెక్స్​ రాకెట్​'.. ఏడుగురు అరెస్ట్!

గత కొంత కాలంగా బంజారాహిల్స్​ రోడ్‌ నెం.2లో ప్రకాశ్‌ అనే వ్యక్తి ఫ్యామిలీ సెలూన్‌ నిర్వహిస్తున్నాడు. మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఎస్సై ఎస్‌.కరుణాకర్‌రెడ్డి సంబంధిత సిబ్బందితో కలిసి సెలూన్‌పై దాడి చేశారు. నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. సదరు నిర్వాహకుడు ఏర్పాటు చేయలేదు.

జీహెచ్ఎంసీ ట్రేడ్‌ లైసెన్స్‌.. లేకుండానే ఈ సెలూన్‌ను నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. మసాజ్‌ థెరపిస్ట్‌లు, బ్యుటీషియన్ల పేరుతో వివిధ ప్రాంతాల నుంచి పది మంది యువతులను రప్పించి వ్యభిచారానికి పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలింది. సెలూన్‌ యజమాని ప్రకాశ్‌పై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఛీ.. అసలు తల్లేనా? కూతుళ్లనే 'అమ్మ'కానికి పెట్టింది!

Police Raids on Spa centers in hyderabad : బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లో సోనాలిసింగ్‌ అనే బ్యూటీషియన్‌ కొంత కాలంగా మహి ఆయుర్వేది వెల్‌నెస్‌ ఫ్యామిలీ సెలూన్‌ పేరుతో స్పాను నిర్వహిస్తున్నారు. ఇందులో మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ ఎస్సై మనోజ్‌ కుమార్‌ దాడులు నిర్వహించారు. ఈ సెలూన్‌ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లుగా గుర్తించారు. స్పా ముసుగులో ఈ కేంద్రాన్ని వ్యభిచార గృహంగా మార్చినట్లుగా తనిఖీల్లో వెల్లడైంది. నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్10లోని కార్వీ ఎదురుగా ఓ అపార్ట్‌మెంట్‌లో పర్పుల్‌ నేచురల్‌ హెల్త్‌ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జాహెద్‌ ఉల్​హక్‌ కలిసి స్పా సెంటర్‌ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి.. క్రాస్‌ మసాజ్‌, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా టాస్క్​ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందింది. స్పా సెంటర్​పై నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులు, 18 మంది విటులను, 10 మంది యువతలను ఆదుపులోకి తీసుకుని బంజారాహిల్స్​ పోలీసులకు అప్పగించారు.

ఆన్‌లైన్‌ వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. ఉచ్చులో 14వేల మంది మహిళలు

విద్యార్థినిపై టీచర్​ అత్యాచారయత్నం.. విదేశీ మహిళ ఎదుట డ్రైవర్ వికృత చేష్టలు

హోటల్ హయాత్​లో హైప్రొఫైల్ వ్యభిచారం.. విదేశీ యువతులు.. బడాబాబుల కోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.