నిన్నటి వరకూ అందరితో కలిసి మాట్లాడిన ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న సతీశ్ నాలుగు నెలల క్రితం శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు హస్మత్ పేట్‌లోని చిత్ర గడ్డ వద్ద నివాసం ఉంటున్నారు. శిరీష ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సతీశ్ వ్యసనాలకు బానిసయ్యాడని, ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. భర్తే అమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన గదిలో వస్తువులు చిందర వందరగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలాలనికి క్లూస్ టీంతో చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కొవిడ్-19 దెబ్బకు.. చికెన్ ధరలు ఢమాల్..!