హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన బత్తుల శ్రీకాంత్ రెడ్డి, సౌమ్య దంపతులకు గత 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు నీరజ్, కూతురు మానస ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఈ నెల 20వ తేదీన చిన్న గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన సౌమ్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని చిలకలగూడ పీఎస్ పరిధిలోని శ్రీనివాస్ నగర్లో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది.
రోజూ మాదిరిగానే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉన్న భార్యా పిల్లలు వచ్చేసరికి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఆ మరుసటి రోజు పిల్లలు, సౌమ్య తమ ఇంటికి వచ్చారంటూ శ్రీకాంత్ అత్త ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్ ఫోన్ చేయగా... పిల్లలను ఇంట్లోనే వదిలి పెట్టి సౌమ్య ఎక్కడికో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంటనే అత్తగారింటికి వచ్చిన శ్రీకాంత్ భార్య కోసం వెతికాడు. ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న ప్రమాదం