మహబూబ్‌నగర్ జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో దంపతులు, ఏడాది చిన్నారి, దంపతుల బంధువు మృత్యువాతపడ్డారు.
అసలేం జరిగిందంటే?
నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన నరేశ్ అక్క,బావ వారి పిల్లలను తీసుకుని తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. గ్రామానికి చేరుకునే సమయంలో ఆటో... బియ్యం తరలిస్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో నడుపుతున్న నరేశ్‌తో పాటు అతడి అక్క జ్యోతి, బావ శంకరయ్య, ఏడాది వయసు కోడలు మృతి చెందారు. మరో ఐదేళ్ల హయతి అనే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతదేహాలను జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 5 ఎకరాల పొలం.. 23 రకాల పంటలు...