ETV Bharat / state

భర్త వేధింపులు తాళలేక మహిళ అనుమానాస్పద మృతి - సికింద్రాబాద్​

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

Suspicious Death
author img

By

Published : Jul 15, 2019, 6:40 PM IST

భర్త వేధింపులు తాళలేక ప్రేమలత అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్​ మోండామార్కెట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మోండా మార్కెట్​లో నివాసం ఉంటున్న ప్రేమలత దంపతులకు ఒక పాప ఉంది. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా కట్నం విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవని వారు అంటున్నారు. ప్రేమలత కుటుంబ సభ్యులు మాత్రం ఆమెది ఆత్మహత్య కాదని... హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ప్రేమలత భర్త సరిగా పని చేయకుండా జులాయిగా తిరిగే వాడని... ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను మారలేదని ప్రేమలత కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితమే అతనిపై షీ టీమ్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రేమలత మృతదేహాన్ని బయటకు తీసుకు రాకుండా బంధువులు అడ్డుకుంటూ తమకు న్యాయం జరగాలని డిమాండ్​ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత అనుమానాస్పద మృతి

ఇవీ చూడండి:ఆస్తి కోసం...కిరోసిన్ పోసి నిప్పంటించాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.