ETV Bharat / state

టిమ్స్​లో డబ్బులు ఇస్తేనే సేవలా..!: మర్రి శశిధర్‌ రెడ్డి - marri shashidhar reddy

కొవిడ్​ వ్యాధిగ్రస్తుల కోసం హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన టిమ్స్​ ఆస్పత్రిలో రోగుల నుంచి ఆస్పత్రి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్​ మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ముందుగా డబ్బులు ఇస్తేనే సేవలు అందుబాటులోకి రావడం దారుణమని అన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని పట్టించుకోవాలని కోరారు.

marri shashidhar reddy,  shashidhar reddy comment on tims hospital
టిమ్స్​లో డబ్బులు ఇస్తేనే సేవలు: మర్రి శశిధర్‌ రెడ్డి
author img

By

Published : Apr 27, 2021, 10:39 PM IST

టిమ్స్​లో డబ్బులు ఇస్తేనే సేవలు: మర్రి శశిధర్‌ రెడ్డి

తెలంగాణ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌-టిమ్స్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కొవిడ్‌ రోగులకు అక్కడి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారని కాంగ్రెస్​ మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌లు ఆరోపించారు. రోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని నిలువు దోపిడి చేస్తున్నారని విమర్శించారు.

అక్కడ క్యాంటీన్‌లో భోజనం బాగలేకపోగా బయట నుంచి తెప్పించుకునే భోజనాన్ని కూడా లోనికి సక్రమంగా పంపడం లేదని ఆరోపించారు. డబ్బు లేనిది అక్కడ ఏ పని జరగడం లేదని ద్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడ పరిస్థితులను చక్క దిద్దాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఏలాంటి కొరత లేకుండా చూడాల్సిన భాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రభుత్వానికి సీపీఎం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.