దుబ్బాక ఉప ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ను... కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుద్ధభవన్‌లోని ఎన్నికల కార్యాలయంలో మర్రి శశిధర్, నిరంజన్‌రెడ్డి ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
80 ఏళ్ల వృద్ధులు, వికలాంగుల కోసం పోస్టల్ బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టారని... పెద్దగుండాలోని ఓటర్ల లిస్టు కావాలని అని ఆడిగితే మాకు ఇవ్వలేదన్నారు. కానీ తెరాసకు చెందిన సర్పంచ్‌కు ఆ లిస్టు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
అవసరమైతే పోస్టల్ బ్యాలెట్‌ను నిలిపివేయాలని శశిథర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం దిల్లీ నుంచి ప్రత్యేక ఐపీఎస్ అధికారి దుబ్బాకకు రానున్న నేపథ్యంలో అక్కడకు వెళ్తున్నట్టు ఆయన చెప్పారు. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వ్యవహరిస్తునందున కేంద్ర బలగాలతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
ఇదీ చూడండి: మన తరుపున మట్లాడేవారే లేరు: రేవంత్‌రెడ్డి