ETV Bharat / state

సహజ అందాలతో మనసును దోచేస్తున్న మడ అడవులు - మడఅడవులు

నదీమతల్లి పరవళ్లు. సముద్రుని సోయగాలు. పచ్చని ప్రకృతి అందాలు... పక్షుల కిలకిలలు. ఎర్రపీతల ఆటలు. వీటన్నింటి సమాహారమే మడ అడవులు. సంద్రానికి ఆకుపచ్చ అంచులా, విభిన్నమైన జీవావరణానికి వేదికలా.. దర్శనమిస్తాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ విభిన్నమైన వృక్ష, జీవజాతుల సమూహం మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తాయి. ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ సమీపంలోని మడ అడవుల చూడచక్కని అందాలు చూసొద్దాం రండి.

natural-beauty
మడ అడవులు
author img

By

Published : Nov 2, 2021, 12:46 AM IST

మదిని దోచే సుందర దృశ్యాలు.. పరవశింపజేసే వాతావరణం. మనసును ఉయ్యాలలూపే ప్రకృతి అందాలు. ఇవే మడ అడవుల సమాహారం. సముద్రుడు.. ఆకాశాన్ని, నేలను కలిపినట్లు, మడ అడవులు. నదీతీరాన్ని ఆ సముద్రుడితో కలుపుతాయి. వీటి మధ్యలో పడవ ప్రయాణం.. చెప్తుంటేనే ఆహా అనిపిస్తోంది కదూ..! ఆ అందాలు చూస్తూ ముందుకు వెళ్తుంటే జీవితంలో మధుర క్షణాలివే అనుకోవటం ఖాయం. ఇక్కడ వెండిపల్లెంలా మెరిసే నీటి అందాల్ని, ఆ నీటిపైనే ఆధారపడే మత్స్యకారుల జీవనశైలిని దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది.

ఈ మడ అడవుల ప్రాంతంలో కనిపించే అరుదైన జీవజాతుల్లో ఎర్రపీతలు ఒకటి. ఇవి మనుషుల్ని చూడగానే దూరంగా పరిగెడతాయి. చెప్పాలంటే వీటికి కొంచెం సిగ్గెక్కువన్నమాట. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఇవి తినేందుకు పనికిరావు.

అభివృద్ధికి నోచుకోవట్లేదు..

నానాటికీ తరిగిపోతున్న జీవవైవిధ్యాన్ని ఈ మడఅడవులు సంరక్షిస్తున్నాయి. ఎంతో వైవిధ్యభరితమైన జీవరాశులకు ఇవి ఆటపట్టుగా ఉంటాయి. వలస పక్షులు గూళ్లు కట్టుకునేందుకు, సముద్రజీవుల సంతానోత్పత్తికి ఈ అడవులు అనువుగా ఉంటాయి. నీటిలోని మాలిన్యాలను, హాని కలిగించే భారలోహాలను శోషించుకుని నీటిని శుద్ధి చేస్తాయి. అలాగే గాలిలోని కాలుష్యాలను శోషించుకుని గాలిని కూడా శుద్ధి చేస్తాయి. అంతేకాదు ఈ అడవులు కలప, వంటచెరకు, పశుగ్రాసం లభించే కేంద్రాలుగా ఉంటాయి. ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల కుటుంబాల సంపాదనకు ఆధారంగా ఉంటున్నాయి. మనకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తున్న ఈ మడ అడవులు అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం ఏర్పాటు చేయటంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి పర్యాటక కేంద్రంగా మారుతోందని.. స్థానికులు చెబుతున్నారు.

మడ అడవులు

ఇదీ చదవండి: బండ బాదుడు- ఎల్​పీజీ సిలిండర్​పై రూ.266 పెంపు

ఆ బాధ్యత స్వీకరిస్తానని పునీత్​కు మాటిస్తున్నా: విశాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.