ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశ్ పదవీ విరమణ మహోత్సవం నాంపల్లి సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా... ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా అహర్నిశలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘము అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి :పోడు భూములపై ముఖ్యమంత్రి హామీ ఏమైంది