ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన మనస్విని ఆరోగ్యం కుదుటపడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని..వెంటిలేటర్ తొలగించినట్లు ఒమ్ని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బాధితురాలు కుటుంబసభ్యులతో సున్నితంగా మాట్లాడుతుందని పేర్కొన్నారు. రేపు మనస్విని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించనున్నట్లు తెలిపారు.
రెండురోజుల క్రితం చైతన్యపురిలోని బృందావనం లాడ్జీకి మనస్విని పిలిపించుకున్న ప్రియుడు వెంకటేష్ కత్తితో అమె గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంకటేశ్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇవీ చూడండి : అమ్మా..! చెత్తకుప్పలో పడేశావా..!