Solar Powered Bike In Palnadu District: ఎండ తగలకుండా, వానకు తడవకుండా, గొడుగు మాదిరి రక్షణ ఇచ్చేలా గమ్మత్తుగా ఉంది కదా ఈ వాహనం. పెట్రోల్ లేకుండానే ప్రయాణించవచ్చంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇదే నిజమే, ఉదయం సోలార్ పవర్ సాయంతో రాత్రి పూట బ్యాటరీ సాయంతో, నడిచే ఈ బైక్‌ను ఏ శాస్త్రవేత్తో తయారు చేశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఓ సాధారణ మెకానిక్.
Solar Powered Bike: ఈయన పేరు షేక్ మస్తాన్ వలీ. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల. వాహనాల మరమ్మతులు, వైండింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా సోలార్, బ్యాటరీ హైబ్రిడ్ బైక్‌ను రూపొందించి శభాష్ అనిపించుకున్నారు. అసలు ఎందుకీ ఆలోచన వచ్చిందో తెలుసా. అర్థమైంది కదా. ఆవిష్కరణ వెనుక ఆలోచన ఇది. చమురు ధరలను భరించలేక.. పెట్రోల్ అవసరమే లేని ద్విచక్ర వాహనాన్ని రూపొందించి సత్తా చాటారు.
సోలార్ బైక్ పగలు సూర్యకాంతితో నడుస్తుంది సరే, రాత్రిపూట ఎలా అనే ప్రశ్న ఎదురైంది మస్తాన్ వలీకి. అంతే బైక్‌లో బ్యాటరీని ఏర్పాటు చేశారు. 2 గంటలు ఛార్జ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా రూపొందించారు. ఈ బైక్‌పై నలుగురు వెళ్లేలా తయారు చేశారు. చదువుకోకపోయినా తెలివితేటలు, పట్టుదలతో సరికొత్తగా ద్విచక్రవాహనాన్ని తయారు చేసి అందరి దృష్టిని మస్తాన్‌వలీ ఆకర్షించారు.
ఇవీ చదవండి: