సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి వయసు 50 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఏ కారణం చేత చనిపోయాడనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఎవరికైనా సమాచారం తెలిసినా, సంబంధీకులు ఉన్నా... గోపాలపురం పోలీసు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.