ETV Bharat / state

'నువ్వు లేని జీవితం నాకొద్దు'

వాళ్లిద్దరికి నిశ్చితార్థమైంది. వారి మధ్య ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ ఏర్పడింది. ఇంకొన్ని రోజుల్లో వివాహం జరగనుండగా.. ఇంతలో యువతి క్యాన్సర్​తో మృతిచెందింది. ఆ ఘటనతో యువకుడు మానసికంగా కుంగి పోయాడు. ఆమె లేని జీవితం వృథా అనుకుని... ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

'నువ్వు లేని జీవితం నాకొద్దు'
author img

By

Published : May 29, 2019, 7:09 PM IST

Updated : May 29, 2019, 7:24 PM IST

యెమన్​ దేశానికి చెందిన మహ్మద్​ ఒత్మన్​ అలీ ​(24) తన బంధువు ఫైజల్​ మబ్కోత్​ హసన్​తో కలిసి హైదరాబాద్​ టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో ఉంటున్నాడు. చదువు కోసం ఇక్కడకు వచ్చి యూసఫ్​గూడలో డిగ్రీ చేస్తున్నాడు. మహ్మద్​ ఒత్మన్​ అలీకి తొమ్మిది నెలల కిందట యెమన్​ దేశానికి చెందిన యువతితో నిశ్చితార్థమైంది. ఇద్దరు ఫోన్​లో మాట్లాడుకోవడంతో మానసికంగా దగ్గరయ్యారు. మూడు నెలల క్రితం ఆ యువతి క్యాన్యర్​తో మృతిచెందింది. ఒత్మన్​ మానసికంగా కుంగిపోయాడు.

ఇదే సమయంలో వీసా గడువు ముగుస్తున్నట్లు ఎఫ్​ఆర్​ఆర్​ఓ నుంచి సమాచారం వచ్చింది. భారత్​ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మానసికంగా కుంగిపోయి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికోచ్చిన అతని బంధువు మబ్కోత్​ హసన్ విషయం గుర్తించగా అప్పటికే చనిపోయాడు. ఘటనాస్థలంలో ఒత్మన్​ తను పెళ్లి చేసుకోవాలనుకున్న యువతిని ఉద్దేశించి రాసిన లేఖ పోలీసులు స్వాధినం చేసుకున్నారు. ఆ లేఖలో... 'నువ్వు లేని జీవితం చాలా బోర్​గా ఉంది... నువ్వు లేని లోకంలో నేనుండలేను... వస్తున్నానంటూ...' పేర్కొన్నాడు. ప్రాథమికంగా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: చరిత్ర ఘనం... ఆదరణ శూన్యం

Last Updated : May 29, 2019, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.