ETV Bharat / state

లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

జీవితం చాలా విలువైనది. ఒక్కసారి కోల్పోతే మళ్లీ తిరిగిరాదనే విషయాన్ని గ్రహించాలి. చిన్న సమస్యలకే ఏమి చేయాలేమని కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్​ ఎస్​ఆర్​ నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి ఏం కష్టం వచ్చిందో కానీ ఆత్మహత్య చేసుకున్నాడు.

లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
author img

By

Published : May 2, 2019, 7:19 PM IST

హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారిలో ఉన్న లాడ్జిలో రూమ్​ అద్దెకు తీసుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.

లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

అసలేం జరిగిందంటే...

ఎస్​ఆర్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బల్కంపేటలో నివాసం ఉండే బి.అమృత్​కుమార్​(33) అనే వ్యక్తి బుధవారం రాత్రి శ్రీకృష్ణ లాడ్జిలో... తాను ముంబయి నుంచి వచ్చినట్లు చెప్పి గది​ అద్దెకు తీసుకున్నాడు.

ఉదయం లాడ్జి రూం సర్వీస్​ బాయ్​ వెళ్లి తలుపు తట్టాడు. ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడం వల్ల అనుమానం వచ్చి నకిలీ తాళంచెవితో గదిని తెరిచి చూశారు. అక్కడ అమృతకుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి మేనేజర్​కు తెలిపారు.

అనంతరం ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి స్థానిక బల్కంపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి శవపరీక్ష కోసం తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.