Knife attack on young woman in the name of love : హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో వేధిస్తూ యువతిపై కత్తితో దాడికి దిగిన గణేష్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ యువతిపై గణేష్ కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాదులోనే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గణేష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఓ యువతిని వేధిస్తున్నాడు.
ఏపీలోని పిడుగురాళ్లకు చెందిన ఓ యువతి గచ్చిబౌలిలోని ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన గణేష్ హైదరాబాదులోనే ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. యువతిని గణేష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఆమె ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత టీ గ్రిల్ హోటల్‌కు తీసుకెళ్లి మరోసారి ఆమెతో ప్రేమ పేరుతో గొడవకు దిగాడు. నువ్వంటే ఇష్టం లేదని గణేష్‌తో చెప్పింది. సదరు యువతి వేరే యువకుడిని ప్రేమిస్తుందని అనుమానం పెంచుకున్న గణేష్ దాడికి ముందే కుట్ర పన్నాడు. బ్యాగులో తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి యువతిపై దాడి చేశాడు. మెడ, ముఖంపై దాడి చేశాడు.
గణేష్ దాడిని తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించే క్రమంలో చేతులకు కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత గణేష్ భయాందోళనకు గురై ఆమెను సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే ఉన్న గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన ప్రాంతం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో గచ్చిబౌలి పోలీసులు సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు.
నార్సింగి పోలీసులు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకొని బాధిత యువతి నుంచి సమాచారం సేకరించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు గణేష్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. వాసవి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గణేష్ బంధువు కావడంతో అతనితో మాట్లాడే దానినని దాన్ని ఆసరాగా తీసుకొని ప్రేమ పేరుతో కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. వాసవిని హత్య చేసేందుకు ప్రయత్నించిన గణేష్‌పై గతంలో ఏదైనా నేరచరిత్ర ఉందా అనే కోణంలో నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
old woman and granddaughter murder Case : షాద్‌నగర్ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు..