ETV Bharat / state

కరోనా నెగిటివ్​ వచ్చింది.. అయినా పరిస్థితి విషమించింది

ఆంధ్రప్రదేశ్​లో కరోనా సోకిందనే అనుమానంతో నెల రోజులపాటు క్వారంటైన్​లో ఉంచిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు విషమంగా మారింది. కరోనా నెగిటివ్​ వచ్చినప్పటికీ గుండె సమస్యతో రోగి అనారోగ్యానికి గురయ్యాడు. ఫలితంగా లాక్​డౌన్​ కారణంగా రోగిని ఆసుపత్రికి తరలించడంలో జాప్యం నెలకొంది.

man-situation-worries-even-though-corona-nagetive-at-nellore-district
కరోనా నెగిటివ్​ వచ్చింది.. అయినా పరిస్థితి విషమించింది
author img

By

Published : May 5, 2020, 7:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి రోగిని నెల్లూరు ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడం వల్ల పరిస్థితి విషమంగా మారింది. ఓజిలి మండలం కార్జింబేడు గ్రామానికి చెందిన ఖాదర్ బాషా ఇటీవల దిల్లీ సభలకు వెళ్లి వచ్చాడు. కరోనా వైరస్ సోకుతుందనే అనుమానంతో భార్యతో కలిసి నెలరోజుల పాటు క్వారంటైన్​లో ఉంచి పరీక్షలు చేశారు.

ఫలితాలు నెగిటివ్ రావడం వల్ల అతనిని ఇంటికి పంపించారు. గుండె పరమైన సమస్యలతో అనారోగ్యానికి గురైన ఖాదర్​ భాషాకు నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేశారు. అనంతరం నాయుడుపేటలోని తమ్ముడు ఇస్మాయిల్ వద్ద నివాసం ఉంటున్నాడు. ఈ తరుణంలో మళ్లీ గుండె పరమైన సమస్యలు తలెత్తడం వల్ల నాయుడుపేట అసుపత్రిలో చికిత్స చేశారు. రోగిని నెల్లూరుకు తరలించడంలో జాప్యం చోటు చేసుకోవడం వల్ల పరిస్థితి విషమంగా మారింది.

కరోనా నెగిటివ్​ వచ్చింది.. అయినా పరిస్థితి విషమించింది

ఇదీ చూడండి: చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.