సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బీహెచ్ఈఎల్ కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఉంటున్న శేషయ్య ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. వెనక నుంచి వచ్చిన టిప్పర్ బైక్ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన శేషయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఖమ్మం జిల్లా తూట్లకుంట గ్రామం.
ఇవీ చూడండి: భట్టి దీక్షతో బయటపడ్డ విబేధాలు