తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలిగా మమత, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో అధికారులు వీరిని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధానకార్యదర్శులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీజీఓ అధ్యక్షురాలు మమత తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని అన్నారు.
ఇదీ చూడండి : రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా