ETV Bharat / state

ప్రైవేట్ యూనివర్సిటీలతో నాణ్యమైన విద్య: వినోద్ - రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ వార్తలు

నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అవసరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ పేర్కొన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ లోగోను ఆయన ప్రారంభించారు. ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, కామర్స్, సైన్స్ విభాగాల్లో డిగ్రీ కోర్సులను ఇక్కడ అందించనున్నారు.

mallareddy-university-inauguration-at-hyderabad
మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మల్లారెడ్డి యూనివర్సిటీ
author img

By

Published : Jun 24, 2020, 6:18 PM IST

రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మల్లారెడ్డి యూనివర్సిటీ నిలిచింది. హైదరాబాద్​లోని దూలపల్లిలో 100 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ దీనిని ప్రారంభించారు. ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, కామర్స్, సైన్స్ విభాగాల్లో డిగ్రీ కోర్సులను ఇక్కడ అందించనున్నారు.

''ఉన్నతమైన, నాణ్యమైన విద్యను అందించటానికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అవసరం. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఎప్పుడో చట్టం కూడా చేసింది. ఉమ్మడి ఏపీలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవకాశాలు కుదరలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా ఉండాలని కేసీఆర్ ఆలోచించేవారు. ఆ కలను మల్లారెడ్డి నిజం చేశారు. హైదరాబాద్​లో 100 ఎకరాల భూమి ఉండి... డబ్బుకోసం ఆశపడకుండా... మల్లారెడ్డి దీనిని నిర్మించారు. డబ్బు గురించి ఆశపడే వారైతే రియల్​ ఎస్టేట్​కే వెళ్లేవారు.''

వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు.

''ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మల్లారెడ్డి యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చిన కేసీఆర్​కి నేను, నా కుటంబం రుణపడి ఉంటాం. విద్యావ్యవస్థలో ఇది ఒక కీలక అడుగు. ఇప్పటివరకు మల్లారెడ్డి కాలేజీల్లో ఉన్నత విద్యను అందించాం. ఇకపై కూడా నాణ్యమైన విద్యను అందిస్తాం. ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతాం.''

-మంత్రి మల్లారెడ్డి

మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మల్లారెడ్డి యూనివర్సిటీ

యూనివర్సిటీ ఛాన్సలర్‌గా జెఎన్​టీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి నియమితులయ్యారు. ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్, కామర్స్, సైన్స్ విభాగాల్లో డిగ్రీ కోర్సులను ఇక్కడ అందించనున్నారు.

ఇవీ చూడండి: 'కరోనాపై పోరులో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.