ETV Bharat / state

ముషీరాబాద్​లో వైభవంగా మల్లన్న జాతర మహోత్సవం - శ్రీ  భ్రమరాంబ  మల్లికార్జున  స్వామి దేవాలయంలో  మల్లన్న జాతర మహోత్సవాలు

హైదరాబాద్ ముషీరాబాద్ బాకారంలోని  శ్రీ  భ్రమరాంబ  మల్లికార్జున  స్వామి దేవాలయంలో  మల్లన్న జాతర మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామికి పంచామృత అభిషేకాలు, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు బ్రహ్మణ వేద మంత్రోచ్ఛారణాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు.

ముషీరాబాద్​లో వైభవంగా మల్లన్న జాతర మహోత్సవం

author img

By

Published : Jan 16, 2020, 6:21 AM IST

ముషీరాబాద్​లో వైభవంగా మల్లన్న జాతర మహోత్సవం

ప్రతీ సంవత్సరం నిర్వహించే కొమురవెల్లి మల్లన్న జాతర మాదిరిగానే హైదరాబాద్ ముషీరాబాద్ బాకారంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న జాతర మహోత్సవాలు రెండు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామికి పంచామృత అభిషేకాలు, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు బ్రాహ్మణ వేద మంత్రోచ్ఛారణాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు.

స్వామిపై ఒగ్గు కళాకారుల పాటలు:

బుధవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం అనంతరం ఎదుర్కోలు వంటి కార్యక్రమాలు జరిగాయి. స్వామి కల్యాణం తర్వాత స్వామి విగ్రహాన్ని పటం మధ్య పెట్టి బాబురావు ఒగ్గు కళాకారుల బృందం స్వామిపై పాటలు పాడుతూ డప్పు వాయిస్తూ బండారాన్ని ప్రసాదంగా అందరికీ అందజేశారు. స్వామికి ఆలయ మాజీ ఛైర్మన్ నల్లవెల్లి అంజిరెడ్డి దంపతులు బోనం సమర్పించారు.

తలపై బోనాలతో ఊరేగింపు..

చివరగా కొంతమంది జోగినీలు తలపై బోనాలు పెట్టుకొని ఒగ్గు కళాకారుల ఆటపాటల మధ్య ఇందిరా నగర్​లోని ఈదమ్మ పోచమ్మ దేవాలయం వరకు ఊరేగించారు. అనంతరం బోనాలను అమ్మవార్లకు సమర్పించారు. ఈ ఆలయం భోలక్పూర్ సమీపంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: మూడోరోజు రాత్రి మల్లన్న జాతర ప్రత్యేక ఆకర్షణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.