ETV Bharat / state

పాత్రికేయుల కుటుంబాల‌కు ఆర్థిక చేయూత - hyderabad latest news

కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుల కుటుంబాల‌కు మల్లారెడ్డి గ్రూప్‌ సంస్థ, హై బిజ్ టీవీ అండ‌గా నిలిచింది. మృతి చెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థికంగా చేయూత‌ అందించింది.

Malla Reddy Group provides financial assistance to the families of journalists in hyderabad
పాత్రికేయుల కుటుంబాల‌కు మల్లారెడ్డి గ్రూప్‌ సంస్థ ఆర్థిక సాయం, హైదరాబాద్‌ తాజా వార్తలు
author img

By

Published : Apr 3, 2021, 6:40 PM IST

కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుల కుటుంబాల‌కు మల్లారెడ్డి గ్రూప్‌ సంస్థ, హై బిజ్ టీవీ అండ‌గా నిలిచింది. మృతి చెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థికంగా చేయూత‌ అందించింది. కరోనా మహమ్మారితో మరణించిన పాత్రికేయులు వెంకటేశ్వర్‌ రావు, రవీందర్‌ నాథ్‌ కుటుంబాలకు లక్ష రూపాయ‌ల చొప్పున అందజేసింది.

ఈ సందర్భంగా హై బిజ్ టీవీ సీఎండీ మాడిశెట్టి రాజ‌గోపాల్, మార్కెటింగ్ డైరెక్ట‌ర్ సంధ్యారాణి, మ‌ల్లారెడ్డి గ్రూప్ సంస్థలకు వారు కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. మరణించిన కుటుంబ సభ్యుల తరుఫున ప్రముఖ పాత్రికేయులు మురళీకి... హై బిజ్‌ టీవీ పాత్రికేయులు అనిల్‌ కుమార్‌ చెక్‌లను అందజేశారు.

ఇదీ చదవండి: దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.