ETV Bharat / state

అర్నబ్ గోస్వామిపై ఫిర్యాదు చేసిన రేవంత్​రెడ్డి

రిపబ్లిక్​ టీవీ యజమాని అర్నబ్​ గోస్వామిపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు ఎంపీ రేవంత్​ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్​ నాయకురాలు సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆ వ్యాఖ్యలు మత విద్వేశాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి: రేవంత్​ రెడ్డి

author img

By

Published : Apr 24, 2020, 5:17 PM IST

Updated : Apr 25, 2020, 7:50 PM IST

కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీపై రిపబ్లిక్‌ టీవీ యజమాని అర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అర్నబ్‌ గోస్వామి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ ప్రివిలైజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. ఎంపీ, పార్లమెంటరీ పార్టీనేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు.

అర్నబ్ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్న రేవంత్‌ రెడ్డి పార్లమెంటు గౌరవాన్ని, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. లాక్ డౌన్ కారణంగా నేరుగా కాకుండా ఆన్​లైన్‌ ద్వారా ప్రివిలైజ్‌ మోషన్ పంపినట్లు తెలిపిన రేవంత్‌ రెడ్డి తక్షణమే అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసేందుకు పోలీసు అధికారులకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: సీఎంఆర్​ఎఫ్​కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు

Last Updated : Apr 25, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.