కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అభినందించారు. కంటికి కనిపించని కరోనా వైరస్‌ను అందరూ.. ఐక్యంగా ఉండి తరిమికొట్టాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే అదేశాలను ప్రతి ఒక్కరూ.. పాటించాలని సూచించారు. వైరస్ నియంత్రణ కోసం పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రమిస్తున్నారని... వారి సేవలకు ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాలన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని ఆయన కోరారు.
ఇదీ చూడండి: 'మరణాలు పెరిగినా.. నేనేమీ అద్భుతాలు చేయలేను'