ఎస్సీ వర్గీకరణను అడ్డుకుని తీరుతామని మాల మహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తలొగ్గి కొందరు భాజపా నేతలు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో జి.చెన్నయ్యతో పాటు పలువురు మాలమహానాడు నేతలు పాల్గొని 'ఛలో దిల్లీ' కార్యక్రమం పోస్టర్‌ను విడుదల చేశారు.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో 5 లక్షల మందితో "హాలో మాల.... ఛలో దిల్లీ" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెన్నయ్య తెలిపారు. మందకృష్ణ మాదిగ దిల్లీలో ఎన్ని రోజులు ధర్నా కార్యక్రమాలు చేస్తే... తాము అన్ని రోజులు అక్కడే ఉండి వర్గీకరణను అడ్డుకుంటామన్నారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది'