సచివాలయ నిర్మాణంలో భాగంగా మసీదు, దేవాలయాలను తొలగించి నూతనంగా వాటిని నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆలయం, మసీదు దెబ్బతినటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై అసద్ స్పందించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను ఆయన ట్విట్టర్లో పొందుపరిచారు. ఈ అంశంపై యునైటెడ్ ముస్లిం ఫోరం తరఫున సవివర ప్రకటన విడుదల చేయనున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు.