మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు అధికారం నుంచి తప్పుకోవాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద డిమాండ్ చేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై కేంద్రం వైఖరికి నిరసనగా మహిళా కాంగ్రెస్ సభ్యులు పోస్టుకార్డుల ఉద్యమం హైదరాబాద్ గాంధీభవన్లో మాజీ ఎంపీ మధుయాష్కీతో కలిసి చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని శారద ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో 33 లక్షల సంతకాల సేకరణతో దేశాధ్యక్షుడు నరేంద్రమోదీకి నివేదించామని నేరెళ్ల శారద పేర్కొన్నారు. అయితే మరోసారి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టినట్లు ఆమె వివరించారు. దేశంలో జంతువులకు ఇస్తున్న ప్రాధాన్యత కూడా మహిళలకు లేకుండా పోతోందని ఆమె ఆరోపించారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన... మహిళలకు ఒక రక్షణ కవచంలా సాగిందని.. మహిళలకు రక్షణ కల్పించలేని మోదీ.. ప్రధాని స్థానానికి అర్హులు కారని విమర్శించారు.
ఇదీ చదవండిః శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు