మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ విఠల్వాడీలోని శ్రీ వీరాంజనేయ స్వామి సాయిబాబా దేవాలయంలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు శివలింగ ఆకారంలో దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.
జాగారణ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భక్తి సంగీత కార్యక్రమంలో గాయనీ గాయకులు ఆలపించిన పాటలు, శివ భక్తి గీతాలు అందరినీ విశేషంగా అలరించాయి.
ఇదీ చూడండి: 1100 అడుగుల ఎత్తులో శివరాత్రి వేడుకలు