Maharashtra Leaders Joins BRS : దేశ ఆర్థిక రాజధానిగా పేరు పొందిన ముంబయి వంటి నగరాలు, పారిశ్రామిక పట్టణాలు.. నదులు, సహజ వనరులు ఉన్నప్పటికీ మహారాష్ట్రలో ప్రజలకు కనీసం తగినన్ని మంచినీళ్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నీటి కోసం మహిళలు తాళ్లతో బావుల్లోకి దిగాల్సిన దుస్థితి ఎందుకు ఉందో మహారాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సర్పంచ్లు, ఉపసర్పంచ్లు హైదరాబాద్(Hyderabad)లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
CM KCR Speech on Maharashtra Politics : ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్... దేశంలో పుష్కలమైన నీటి వనరులు, వర్షపాతం ఉన్నప్పటికీ తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ పరిపూర్ణ తాగునీటి వ్యవస్థ లేదని అన్నారు. జలవనరులు ఇలాగే సముద్రాల్లో కలుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ఏమైనా చేయాలా అని కేసీఆర్ అన్నారు. ఏమైనా చేయాలంటే విప్లవించాలని.. అయితే విప్లవం దానికదే రాదని.. యువత ఉద్యమించాలన్నారు. రైతులను ఏకం చేయాలని.. ప్రజలకు వివరించి ఉద్యమించేలా చైతన్యవంతుల్ని చేయాలన్నారు.
CM KCR on Maharashtra Development : ఒకవైపు నీరు సముద్రంలో కలుస్తుండగా.. మరోవైపు మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం వెనక కారణాలేంటో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగాలంటే రైతుబంధు(Rhythu Bandu), రైతుబీమా (Rhythu Bheema), ఉచిత విద్యుత్ వంటి తెలంగాణ తరహా పథకాలు కావాలని ఔరంగాబాద్ డివిజన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి కేంద్రేకర్ ప్రభుత్వానికి సూచిస్తే ఆయనను రాజీనామా చేయించారన్నారు. మహారాష్ట్రలో పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలను అందించడం లేదని.. తెలంగాణలో తాము లీటర్ కు 4 రూపాయల ప్రోత్సాహకాలను ఇస్తున్నామని కేసీఆర్ వివరించారు. చెరువుల పూడికతీత, చెక్ డ్యాముల నిర్మాణంతో నీటి వనరులను సంరక్షించుకోవడంతో తెలంగాణలో భూగర్భవనరులు సమృద్ధిగా పెరిగాయని కేసీఆర్ వివరించారు.
BRS on Maharashtra Politics : తెలంగాణలో రైతులు ఎన్ని గంటలు, ఎన్ని మోటార్లు వాడుకున్నా ప్రభుత్వం రైతులను ప్రశ్నించదని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో తాను కాలు పెట్టిన తర్వాత... బీఆర్ఎస్ భయంతో విద్యుత్ కోతలు ఎత్తేశారని ఆయన అన్నారు. ఎన్నో నగరాలు, పరిశ్రమలున్న మహారాష్ట్ర ఆదాయం ఏమవుతోందని కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రను ఇప్పటి వరకు పాలించిన కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ సమస్యలను ఎందుకు దూరం చేయలేకపోయాయని కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కొత్త పార్టీ అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే రెండేళ్లలో తెలంగాణ మాదిరి వెలుగు జిలుగులను ఆవిష్కరించుకోవచ్చునని కేసీఆర్ అన్నారు. మూడేళ్లలో మహారాష్ట్రలో ఇంటింటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు.
CM KCR Nagpur Tour Updates : 'మహారాష్ట్రలో త్వరలోనే పరివర్తన వస్తుంది.. అది దేశమంతా పాకుతుంది'
మహారాష్ట్రలో కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది : తొమ్మిదిన్నరేళ్లలోనే తెలంగాణలో ఇంతటి ప్రగతి సాధ్యమైనప్పుడు దశాబ్దాల క్రితం రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎందుకీ వెనకబాటు తనమని కేసీఆర్ అన్నారు. ధనం లేక కాదని.. నాయకులకు ప్రజలపై, ప్రగతి పై మనసు లేక మహారాష్ట్ర పరిస్థితి ఇలా ఉందన్నారు. రైతులే ప్రభుత్వంగా ఆవిర్భవించాలని.. అందుకే బీఆర్ఎస్ 'అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్' (Abki Baar Kisan Sarkar) నినాదం ఇచ్చిందని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రైతులు, పేదల కోసమే పనిచేస్తుందన్నారు. మహారాష్ట్రలో కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. నెల రోజుల్లోపే మార్పు కనిపిస్తుందన్నారు. విధర్భలోని బుల్డానా జిల్లాలోని సర్పంచ్లకు మరో రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ.. వారందరూ బీఆర్ఎస్లో చేరనున్నారన్నారు.
CM KCR MAHARASHTRA TOUR : 'అన్నాభావ్ రచనలు విశ్వజనీనం.. ఆ యుగకవికి భారతరత్న ఇవ్వాలి'