MLC Madhusudhana Chary : ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మాజీ సభాపతి, సీనియర్ నేత, మధుసూదనాచారి మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి... మధుసూధాచారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ శాసన మండలి ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.
గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధికార తెరాస.. కాంగ్రెస్ నుంచి తెరాసకు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డిని ప్రతిపాదించింది. కానీ గవర్నర్ తమిళిసై నుంచి ఆమోదం లభించలేదు. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుసూదనాచారికి అవకాశం కల్పించారు.
ఇదీ చూడండి: హనుమకొండలో కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ