కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సన్షైన్ ఆస్పత్రి... జాయింట్ రిప్లేస్మెంట్ కోసం నాలుగో తరం రోబోను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్లో ఆర్థో విభాగంలో శస్త్ర చికిత్సలో సత్ఫలితాల కోసం రూపొందించిన మ్యాకో రోబోను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రోబోలు శస్త్ర చికిత్సలను మరింత కచ్చితత్వంతో చేస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఈటలతో పాటు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బ్యాండ్మింటన్ క్రీడాకారణి పీవీ సింధు, సన్ షైన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
- ఇవీ చూడండి: ఎప్పటిలాగే .. పాతపాటే .. మరోసారి మొండి చెయ్యే!